![]() |
![]() |

కిర్రాక్ బాయ్స్ అండ్ ఖిలాడీ గర్ల్స్ షూటింగ్ సెట్స్ ఆఫ్ స్క్రీన్ లో శ్రీముఖి చేసే సందడి అంతా ఇంతా కాదు. రీసెంట్ గా అలాంటి ఆఫ్ స్క్రీన్ కంటెంట్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీముఖి రెడీ అయ్యి ఈ షోలో ఉన్న గర్ల్స్ ని బాయ్స్ ని ఈ షో మీద అభిప్రాయం అడుగుతూ ఉంది. ఐతే విష్ణు ప్రియా ఈ షో బిగ్ బాస్ కంటే చాలా బెటర్ అని బిగ్ బాస్ కంటే పెద్ద నరకం ఇంకోటి లేదంటూ సెన్సేషనల్ కామెంట్స్ చేసింది. శ్రీముఖి దగ్గరకు సాకేత్ కొమాండూరి వచ్చాడు. అతన్ని కూడా ఈ షో మీద ఒపీనియన్ అడిగింది. "ఈ షో నైస్. చాలా ఫన్ ఉంది..మినీ బిగ్ బాస్ లా అనిపించింది" అంటూ చెప్పాడు.
వెంటనే విష్ణుప్రియ కంటిన్యూ చేస్తూ "బిగ్ బాస్ ఎంత నరకమో తెలుసో..ఇప్పుడు బ్రేక్స్ కి వెళ్తున్నారు కానీ బిగ్ బాస్ లో అలా ఉండదు" అనేసరికి శ్రీముఖి దాన్ని నెగటివ్ చేసి "బిగ్ బాస్ నరకం అంటున్న విష్ణు ప్రియా" అనే థంబ్ నైల్ చెప్పేసరికి విష్ణుప్రియాకి కోపం వచ్చింది. "నరకం ప్రతీ నిమిషం నరకం శ్రీముఖి నా ఫ్రెండ్ అనుకున్నా కానీ కాదు ఈమె పెయిడ్ హాలిడేలా ఉంటది అని చెప్పింది కానీ లోపల రెండు బాత్ రూమ్స్ ఇచ్చారు అందులోనే 14 మంది ఉండాలి.. అందులోనే పాయఖానాకి వెళ్ళాలి " అంటూ బిగ్ బాస్ మీద గట్టిగా వ్యతిరేకత వెళ్లగక్కింది. "అవును రా నువ్వు బిగ్ బాస్ కి వెళ్లాల్సి వస్తే వెళ్తావా" అంటూ శ్రీముఖి సాకేత్ ని అడిగేసరికి "చూద్దాం..అది టైం డిసైడ్ చేయాలి..నువ్వు నేను కాదు " అన్నాడు. "నువ్వు బిగ్ బాస్ లో ఉండలేవు..కట్టలు తెంచుకుని దూకేస్తావ్ అక్కడి నుంచి" అంటూ విష్ణు ప్రియా పక్క నుంచి ప్రామ్ప్టింగ్ ఇచ్చింది. "వెళ్తే నువ్వు బిగ్ బాస్ హౌస్ లోని స్మోకింగ్ ఏరియాలోనే ఉంటావేమో" అంటూ సాకేత్ ని అడిగింది శ్రీముఖి. "ఆ ఏరియాలోకి అసలు వెళ్ళను నాకు స్మోక్ పడదు" అన్నాడు సాకేత్.
![]() |
![]() |